న్యూఢిల్లీ: అక్రమ సంబంధం దారుణమైన మర్డర్(Murder)కు దారి తీసింది. యూపీలో ఆ హత్యా ఘటన చోటుచేసుకున్నది. స్టోరీలోకి వెళ్తే.. మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ ఓ మెర్చంట్ నేవీ ఆఫీసర్. 2016లో అతను ముస్కాన్ రస్తోగిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. కానీ సాహిల్ శుక్లా అనే వ్యక్తితో ముస్కాన్ మరో రిలేషన్లో ఉన్నది. ముస్కాన్, సాహిల్.. ఓ ప్లాన్ వేసి నేవీ ఆఫీసర్‌ను హత్య చేశారు. అతని శరీరాన్ని 15 ముక్కలుగా కోసేశారు. ఓ డ్రమ్ములో ఆ ముక్కల్ని వేసి సిమెంట్‌తో సీల్ చేశారు. ఈ హీనమైన క్రైం గురించి పోలీసులు చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు.
ముస్కాన్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న సౌరభ్.. తన భార్యతో ఎక్కువ సమయం గడపాలనుకున్నాడు. దీంతో అతను నేవీ జాబ్‌ను వదిలేశాడు. ఆ నిర్ణయం ఇద్దరి కుటుంబాల్లో వివాదం సృష్టించింది. సౌరభ్ ఇళ్లు విడిచి వెళ్లిపోయాడు. ఓ కిరాయి ఇంట్లో కొత్త జంట సంసారం స్టార్ట్ చేసింది. 2019లో ఆ జంటకు ఓ కూతురు పుట్టింది. కానీ వాళ్ల సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. సాహిల్ అనే స్నేహితుడితో ముస్కాన్‌కు రిలేషన్ ఉన్నట్లు సౌరభ్ గుర్తించాడు. దీంతో ఆ జంట మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. డైవర్స్ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కానీ కుమార్తె గురించి ఆలోచించిన సౌరభ్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 2023లో మళ్లీ నేవీ ఉద్యోగంలో చేరాడు వెళ్లాడు. పని కోసం దేశం విడిచి వెళ్లాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సౌరభ్ కుమార్తెకు ఆరో పుట్టిన రోజు చేశారు. దాని కోసం అతను ఫిబ్రవరి 24వ తేదీన ఇంటికి వచ్చాడు. సౌరభ్ దేశంలో లేని సమయంలో ముస్కాన్, సాహిల్ క్లోజ్ అయ్యారు. ఆ ఇద్దరూ సౌరభ్‌ను చంపేయాలని డిసైడ్ అయ్యారు. మార్చి 4వ తేదీన ఫుడ్‌లో స్లీపింగ్ పిల్స్ కలిపి సౌరభ్‌కు ఇచ్చింది ముస్కాన్. నిద్రలోకి వెళ్లిన నేవీ ఆఫీసర్‌ను .. లవర్‌తో కలిసి భార్య చంపేసింది. ఓ కత్తితో శరీరాన్ని ముక్కలుగా కోసేశారు. డ్రమ్ములో ఆ ముక్కల్ని వేసి, దాన్ని సిమెంట్‌తో కప్పేశారు.
సౌరభ్ గురించి ఇంటి పక్కవాళ్లు ముస్కాన్‌ను అడిగారు. ఆ సమయంలో అతను హిల్ స్టేషన్‌కు వెళ్లినట్లు చెప్పిందామె. ఎవరికీ అనుమానం రావొద్దు అన్న ఉద్దేశంతో సాహిల్‌తో కలిసి సౌరభ్ ఫోన్‌తో మనాలీ వెళ్లింది ముస్కాన్. సోషల్ మీడియాలో సౌరభ్ ఫోన్‌తో ఫోటోలు అప్లోడ్ చేసింది. కానీ ఫోన్ కాల్స్‌కు సౌరభ్ రియాక్ట్ కాకపోవడంతో..అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా ముస్కాన్, సాహిల్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వాళ్లను ప్రశ్నించారు. ఆ టైంలో మర్డర్‌ను ఒప్పేసుకున్నారు. ఆ శరీరం ఎక్కడుందో చెప్పారు. పోలీసులకు డ్రమ్ము దొరికినా, దాన్ని బ్రేక్ చేయడం వీలుకాలేదు. సిమెంట్ గట్టిగా పట్టేయడంతో.. ఓ సుత్తెతో దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు. డ్రమ్మును మార్చురీకి తీసుకెళ్లి అక్కడ డ్రిల్ మెషీన్‌తో సౌరభ్ శరీరాన్ని వెలికితీశారు. మర్డర్ జరిగిన 14 రోజుల తర్వాత అతని బాడీని గుర్తించారు. నిందితుల్ని ఇద్దర్నీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు మీరట్ సిటీ పోలీసు చీఫ్ ఆయుష్ విక్రమ్ సింగ్ తెలిపారు.