
లక్నో: బర్త్ డే సెలబ్రేషన్ సందర్భంగా కొందరు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. రాత్రివేళ తుపాకీ కాల్పుల శబ్దాలకు స్థానికులు భయాందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ శివారులోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన నోయిడాలో ఈ ఘటన జరిగింది. గ్రేటర్ నోయిడాలోని పారామౌంట్ సొసైటీ వద్ద ఉన్న పార్క్‌లో గురువారం రాత్రి కొందరు బర్త్ డే వేడుక చేసుకున్నారు. ఒక కారుపై పలు రకాల కేకులు ఉంచారు. ఒక వ్యక్తి గన్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. పక్కనున్నవారు అతడ్ని ఎంకరేజ్ చేశారు.
మరోవైపు మధ్య రాత్రివేళ తుపాకీ కాల్పుల శబ్దాలకు స్థానిక నివాసితులు భయాందోళన చెందారు. దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు అక్కడకు చేరే సరికి ఆ వ్యక్తులు వెళ్లిపోయారు. కాగా, వారికి సహకరించిన సెక్యూరిటీ గార్డ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్, బులెట్లను స్వాదీనం చేసుకున్నారు. ఆ గన్‌తో కాల్పులు జరిపిన వ్యక్తి, అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న వారికి గిఫ్ట్ ఇచ్చేందుకు పోలీసులు వెతుకుతున్నారంటూ ఒకరు పేర్కొన్నారు.
Birthday celebratory firing! The video is stated to be from Greater Noida's Bisrakh area. Police is looking for them to give the birthday gift now. pic.twitter.com/95Y4CNghRu
— alok singh (@AlokReporter) December 17, 2021