న్యూఢిల్లీ, జనవరి 18: దేశంలోకి సెకండ్ హ్యాండ్ వైద్య పరికరాలను దిగుమతి చేసుకోకుండా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అడ్డుకట్ట వేసింది. వీటి దిగుమతిని అనుమతించవద్దని కోరుతూ కస్టమ్స్ విభాగం ప్రిన్సిపల్ కమిషనర్‌కు లేఖ రాసింది.
వైద్య పరికరాల నిబంధనల ప్రకారం రీఫర్బీష్డ్(సెకండ్ హ్యాండ్) వైద్య పరికరాలకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట నియమాలు లేవని లేఖలో పేర్కొన్నది. కాబట్టి, ఈ పరికరాల దిగుమతి చేసుకోవడానికి ఎలాంటి లైసెన్స్ జారీ చేయడానికి వీలు లేద ని తెలిపింది. సీడీఎస్సీఓ నిర్ణయా న్ని వైద్య పరికరాల తయారీదారులు స్వాగతించారు. ఈ నిర్ణయం దేశ ంలో వైద్య పరికరాల తయారీ రం గానికి మేలు చేస్తుందని అన్నారు.