Wedding Loans | చెన్నై, నవంబర్ 15: ప్రీవెడ్డింగ్, సంగీత్, హల్దీ, మ్యారేజ్, రిసెప్షన్ అంటూ.. వివాహ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న వేళ మ్యాట్రిమొనీ.కామ్ సంస్థ సరికొత్త సేవలు ప్రారంభించింది. ఇంతకాలం పెండ్లి సంబంధాలు కుదుర్చుతున్న ఈ సంస్థ ఇక మీదట పెండ్లి ఖర్చుల కోసం రుణాలు ఇప్పించనుంది.
ఇందుకోసం ప్రత్యేకంగా ‘వెడ్డింగ్లోన్స్.కామ్’ అనే ఫిన్టెక్ వేదికను ప్రారంభించింది. ఐడీఎఫ్సీ, టాటా క్యాపిటల్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్ వంటి సంస్థలతో తాము జట్టుకట్టామని, వీటి నుంచి వివాహాల కోసం రుణాలు ఇప్పిస్తామని మ్యాట్రిమొనీ.కామ్ సంస్థ సీఈవో మురుగవేల్ జానకిరామ్ శుక్రవారం తెలిపారు.