ఔరా అనిపిస్తున్న సోలార్కారు
శ్రీనగర్, జూన్ 23: ఆయనో లెక్కల మాస్టారు.. సౌర విద్యుత్తుతో నడిచే కారు తయారు చేయాలన్నది ఆయన కల. అందుకోసం ఏకంగా 11 ఏండ్లు కష్టపడి కారును అభివృద్ధి చేశాడు. తన ఇంటి పెరడునే ప్రయోగశాలగా మలచుకుని తన కలను సుసాధ్యం చేసుకున్నాడు.
శ్రీనగర్‌లోని సనత్‌నగర్‌కు చెందిన బిలాల్ అహ్మద్ వృత్తిరీత్యా గణితం టీచర్. సోలార్ కారు తయారు చేయడం కోసం సొంత కారుకు మార్పులు చేసి విజయవంతమయ్యాడు. తక్కువ సూర్యరశ్మి ఉండే ప్రాంతాల్లో కూడా ఈ కారు నడుస్తుందని బిలాల్ చెబుతున్నాడు.