రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న సరిస్కా టైగర్ రిజర్వ్‌లో కార్చిచ్చు రేగింది. 10 చదరపు కిలోమీటర్ల పరిధికి మంటలు వ్యాప్తించాయి. వాటిని అదుపు చేసేందుకు ఐఏఎఫ్ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మంటలు పాక్షికంగా అదుపులోకి వచ్చాయని, కొండ ప్రాంతం కావడంతో మంటలు ఆర్పడం కష్టతరంగా ఉన్నదని సరిస్కా ఫీల్డ్ డైరెక్టర్ ఆర్ఎన్ మీనా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతంలో ఒక్క పులి కూడా చిక్కుకోలేదని, వాటి కదలికలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.