రాయ్‌పూర్: ఒక కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం (fire at commercial complex) జరిగింది. దీంతో మంటల నుంచి తప్పించుకునేందుకు కొందరు వ్యక్తులు మొదటి అంతస్తు పైనుంచి కిందకు దూకారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ట్రాన్స్పోర్ట్ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక వాణిజ్య సముదాయంలో సోమవారం పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పరిసర ప్రాంతాలకు ఆ మంటలు వ్యాపించాయి. దీంతో కమర్షియల్ కాంప్లెక్స్‌లోని సిబ్బంది భయాందోళన చెందారు. మొదటి అంతస్తులో ఉన్న కొందరు మంటల నుంచి తప్పించుకునేందుకు అక్కడి నుంచి కిందకు దూకారు.
కాగా, సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఆ కాంప్లెక్స్‌లో ఉన్న ఇండియన్ బ్యాంక్‌తోపాటు పలు షాపులు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు ఆ కమర్షియల్ కాంప్లెక్స్‌లో భారీగా ఎగసిపడిన మంటలు, మొదటి అంతస్తు పైనుంచి కొందరు కిందకు దూకిన దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
कोरबा के काम्प्लेक्स में लगी आग, वीडियो में देखिए कैसे महिला समेत कई लोगों ने पहली मंजिल से कूदकर बचाई जान: https://t.co/VV9khvcZwU#Korba #VideoViral #FireVideo #Chhattisgarh pic.twitter.com/iBqPbpTsR9
— NaiDunia (@Nai_Dunia) June 19, 2023