పోలీస్ కస్టడీలో భౌతిక దాడితో పాటు వేధింపులకు గురిచేశారు : నటి కేతకి చితాలె
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై జైలు పాలయిన మరాఠీ నటి కేతకి చితాలె సంచలన ఆరోపణలు చేశారు.
ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై జైలు పాలయిన మరాఠీ నటి కేతకి చితాలె సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై భౌతిక దాడి చేశారని, వేధింపులకు గురిచేయడంతో పాటు చట్టవిరుద్ధంగా నిర్భందించారని కేతకి ఆరోపించారు.
“నన్ను చట్టవిరుద్ధంగా ఇంటి నుంచి తీసుకువెళ్లి, జైలు పాలు చేశారు.. లైంగిక వేధింపులకు గురిచేసి తీవ్రంగా కొట్టారని ” ఆమె ఓ వార్తాసంస్ధతో పేర్కొన్నారు. ఓ ఫేస్బుక్ పోస్ట్‌కు సంబంధించి గత నెలలో అరెస్టయిన కేతకి చితాలెకు థానే కోర్టు జూన్ 22న బెయిల్ మంజూరు చేసింది.
శరద్ పవార్ ప్రతిష్టను దిగజార్చేలా ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేయడంపై ఈ ఏడాది మే 14న ఆమెను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. చితాలె చేసిన పోస్ట్ రాజకీయ పార్టీల మధ్య సంవాదానికి దారితీయవచ్చని ఫిర్యాదుదారు స్వప్నిల్ నెట్కే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చితాలెపై మహారాష్ట్రలో 22 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. చితాలెపై మే 20న మరో కేసు నమోదవగా ఆ కేసులోనూ జూన్ 16న ఆమెకు బెయిల్ లభించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

