Maoists attack : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పోలీసులపై ప్రతీకార దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనం లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బీజాపూర్ జిల్లాలోని సోమన్‌పల్లి=రాణిబొడ్లి మధ్య గన్నం నాలా దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే దాడిలో పోలీస్ వాహనం ముందు భాగం దెబ్బతిన్నది. ఆ వాహనంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మందుపాతర పేల్చిన మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.