Afganisthan : దేశం విడిచి వెళ్లిపోతామంటున్న మహిళలు.. అడ్డుకుంటున్న తాలిబాన్ ప్రతినిధులు
Afganisthan : ఆఫ్గన్ ప్రభుత్వం విధిస్తున్న షరతులకు తాళలేక మహిళలు దేశం విడిచి వెళ్లడానికి సిద్ధపడిపోతున్నారు. ఇందులో భాగంగా కొందరు

Afganisthan : ఆఫ్గన్ ప్రభుత్వం విధిస్తున్న షరతులకు తాళలేక మహిళలు దేశం విడిచి వెళ్లడానికి సిద్ధపడిపోతున్నారు. ఇందులో భాగంగా కొందరు మహిళలు దేశం విడిచి వెళ్లడానికి సమయత్తమవుతున్నారు. అయితే వీరిని తాలిబాన్ ప్రతినిధులు అడ్డుకున్నారు. ఈ మహిళలు అక్రమంగా దేశం విడిచి వెళుతున్నారని, అందుకే తాము అడ్డుకున్నామని తాలిబాన్ ప్రతినిధులు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతం వారు తమ అదుపులోనే ఉన్నారని, వారి తరపున వారి బంధువులు వస్తే వదిలి వేస్తామని, అయితే పురుషులు మాత్రమే రావాలని, అప్పటి వరకూ తమ ఆధీనంలోనే ఉంటారని తాలిబాన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మొత్తం 40 మందిని అదుపులోకి తీసుకున్నామని, కొందర్ని ఇప్పటికే విచిడిపెట్టామని పేర్కొన్నారు.
అయితే ఈ వలసల పర్వం గతేడాది ఆగస్టులోనే ప్రారంభమైంది. ఆగస్టులోనే తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్గన్లో ఏర్పడింది. దీంతో చాలా మంది దేశం విడిచి వెళ్లిపోయారు. స్థానిక, అంతర్జాతీయ ప్రతినిధులు వారందర్నీ విమానాల్లో ఎక్కించి మరీ, దేశం దాటేలా ప్రయత్నాలు చేశారు. కొన్ని రోజుల తర్వాత తాలిబాన్ ప్రభుత్వం ఈ వలసలను అడ్డుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఈ మహిళలను అడ్డుకుంది.
సరైన పత్రాలు చూపండి.. వెళ్లండి అంటూనే షరతులు
అయితే వీరందరూ దేశం విడిచి వెళ్లడానికి ఎవరు విమానాలను ఏర్పాట్లు చేస్తున్నారన్న విషయం ఇంకా తెలియలేదని తాలిబాన్ సర్కార్ పేర్కొంటోంది. అయితే సరైన పత్రాలు, ఆధారాలు చూపించి, దేశం విడిచి వెళ్లొచ్చని తాలిబాన్ ప్రతినిధులు అంటున్నారు. ప్రజలు మాత్రం మరోలా చెబుతున్నారు. తమకు దేశం విడిచి వెళ్లే ప్రక్రియలో అధికారులు ఏమాత్రం సహకరించడం లేదని, పత్రాల మంజూరులో లేనిపోని రూల్స్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

