న్యూఢిల్లీ: ఒక విమాన ప్రయాణికుడు విభిన్నంగా వ్యవహరించాడు. బోర్డింగ్ పాస్‌ను పెద్ద పేపర్‌పై ప్రింట్ తీశాడు. (Oversized Boarding Pass) ఎయిర్‌పోర్ట్‌లోని సెక్యూరిటీ సిబ్బందికి దీనిని చూపించాడు. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. అందులోని వివరాలు పరిశీలించేందుకు కాస్త ఇబ్బంది పడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విమానంలో ప్రయాణించేందుకు ఒక వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి భారీ సైజులో ప్రింట్ చేసిన బోర్డింగ్ పాస్‌ను రెండు చేతుల్లో పట్టుకుని చూపించాడు. ఇది చూసి ఆ సెక్యూరిటీ అధికారి అయోమయం చెందారు. పెద్ద పేపర్‌పై ప్రింట్ చేసిన టిక్కెట్ వివరాలను సరిచూసుకునేందుకు కాస్త ఇబ్బందిపడ్డారు. బోర్డింగ్ పాస్‌ను ఇలా ప్రింట్ చేయాలని నీ స్నేహితులకు చెప్పవద్దని నవ్వుతూ అన్నారు.
కాగా, ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘వారు ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నారేమో’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఫన్నీగా స్పందించారు. ఫ్రాంక్ చేసేందుకు లేదా సోషల్ మీడియాలో ప్రయోట్ అయ్యేందుకు ఆ వ్యక్తి ఇలా చేసి ఉంటాడని కొందరు పేర్కొన్నారు.
మరోవైపు ట్రావెల్ కంపెనీ మేక్మైట్రిప్ కూడా ఈ వీడియో క్లిప్‌పై స్పందించింది. పేపర్‌ను సేవ్ చేయాలని సూచించింది. తమ ద్వారా కొనుగోలు చేసిన విమాన టిక్కెట్లను వాట్సాప్‌లో కూడా చూపించవచ్చని పేర్కొంది. మీ ప్రయాణం కంటే మీ జీవితం, అభిరుచి పెద్దవని ప్రశంసించింది.