Manipur Assembly | మణిపూర్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు
Manipur Assembly | మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 8వ తేదీలోగా నామినేషన్లు దాఖలు

న్యూఢిల్లీ : మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 8వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 11 కాగా, 27న పోలింగ్ నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 11 కాగా, 16వ తేదీ లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. రెండో దశ పోలింగ్ మార్చి 3న నిర్వహించనున్నారు. ఫలితాలు మార్చి 10న వెల్లడి కానున్నాయి. మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒకే విడుతలో పోలింగ్ జరగనుంది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. జనవరి 21న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 28. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ జనవరి 31. ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించి, మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలకు, గోవాలో 40 శాసనసభ స్థానాలకు, ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కోవిడ్ వేళ అసెంబ్లీలో పోటీపడే అభ్యర్థులకు కొత్త ఆప్షన్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా పోటీ పడే అభ్యర్థులు తమ నామినేషన్‌ను ఆన్లైన్ ద్వారా వేయవచ్చు అని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. పోలింగ్ బూత్‌లను 16 శాతం పెంచారు. పోలింగ్ బూత్‌ల్లో ఓటర్ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు సీఈసీ చెప్పారు. ఇక కోవిడ్ మూలంగా అభ్యర్థుల నామినేషన్‌ను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు సుశీల్ చంద్ర స్పష్టం చేశారు. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును 40 లక్షలకు ఫిక్స్ చేశారు. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అభ్యర్థుల ఖర్చును 28 లక్షలు ఉంటుందని సీఈసీ వెల్లడించారు. ఎన్నికల నియమావళి తక్షణమే అమలులోకి వస్తుందని ఆయన చెప్పారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కోసం నిర్వహించిన మీడియా సమావేశంలో సుశీల్ ఈ విషయాలను వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

