హైదరాబాద్: ప్రముఖ అగర్బత్తీ బ్రాండ్, మంగళ్దీప్ తమ నూతన శ్రేణి అగరబత్తీలు ‘మంగళ్దీప్ ఉపవేద’ను ఆవిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. విలువ ప్రతిపాదన ఆధారంగా తీర్చిదిద్దిన ఈ అగర్బత్తిలు, వినియోగదారులను అతి పురాతనమైన భారతీయ సంప్రదాయాలతో అనుసంధానిస్తాయి. ఈ అగరబత్తిలు కర్పూరం-తులసి, పంచామృత సువాసనలు కలిగి ఉంటాయి. ఈ అగర్బత్తిలను ‘పరంపర కీ మెహక్’ ప్రచారం ద్వారా విడుదల చేశారు.
ఉపవేద పై మంగళ్దీప్ నూతన టీవీసీ చిత్రం కుటుంబ విలువలు ,సంప్రదాయాలతో ముడిపడి ఉంటుంది. మంగళ్దీప్ బ్రాండ్ అంబాసిడర్ సుప్రసిద్ధ నటి భూమికా చావ్లా ఈ ప్రకటనలో కథానాయికగా కనిపిస్తారు. మంగళ్దీప్ ఉపవేద అగరబత్తిల ద్వారా ఆమె కుటుంబమంతటినీ సంప్రదాయాలతో బంధించడం మంగళ్దీప్ ఉపవేద అగరబత్తి సువాసనలను ఈ టీవీసీ చూపుతుంది. యువతరంతో సహా మొత్తం కుటుంబాన్ని అనుసంధానించే మార్గంగా ఇది ఈ చిత్రంలో కనిపిస్తుంది.
“భారతీయ సంస్కృతిలో అత్యంత కీలకమైనవి సంప్రదాయాలు. మా నూతన శ్రేణి ఉపవేద అగరబత్తిలను ఈ ‘కనెక్ట్ విత్ ట్రెడిషన్స్’ (సంప్రదాయాలతో అనుసంధానం) ఆలోచనను మనసులో ఉంచుకుని, పురాతనమైన వేద గ్రంథాల నుంచి స్ఫూర్తి తీసుకుని తీర్చిదిద్దాము. ముఖ్యంగా కుటుంబంలోని యువతరం కోసం దీనిని వేడుక చేస్తుంది’’ అని “అగరబత్తి అండ్ సేఫ్టీ మ్యాచెస్ బిజినెస్, ఐటీసీ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గౌరవ్ తయాల్ అన్నారు.