ఘజియాబాద్: కర్వా చౌత్ పండగ వేళ గర్ల్‌ఫ్రెండ్‌తో షాపింగ్ చేద్దామనుకున్న ఓ వ్యక్తికి దేహాశుద్ధి జరిగింది. తల్లితో కలిసి ఆ మార్కెట్‌కు వచ్చిన ఆయన భార్య అతన్ని చతకబాదింది. ఈ ఘటన ఘజియాబాద్ మార్కెట్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త కాలర్ పట్టుకుని, మరికొంత మంది మిత్రులతో కలిసి అతనిపై భార్య దాడి చేసింది. అయితే ఆ సమయంలో ఆ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్ అతన్ని రక్షించబోయింది. ఇక అప్పుడు మిగితా ఆడవాళ్లు కూడా ఆమెపై దాడి చేశారు. షాప్ ఓనర్ మాత్రం మీరు బయటకు వెళ్లాలంటూ అరుస్తున్నట్లు వీడియోలో వినిపించింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. ఇటీవల భర్తతో గొడవ పడ్డ భార్య.. తన తల్లితండ్రులతో కలిసి ఉంటోంది. కర్వా చౌత్ పండగ సందర్భంగా పేరెంట్స్‌తో కలిసి ఆమె షాపింగ్‌కు వచ్చింది. అయితే అక్కడే ఓ అమ్మాయితో తిరుగుతున్న భర్తను ఆమె గుర్తించి అటాక్ చేసింది.
కర్వా చౌత్‌ను హిందువులు జరుపుకుంటారు. భర్త సుదీర్ఘ జీవితాన్ని కోరుతూ భార్యలు ఆ రోజున ఉపవాసం ఉంటారు. ఈ పండుగను ఎక్కువగా ఉత్తర, ఈశాన్య భారతంలో సెలబ్రేట్ చేసుకుంటారు.
करवा चौथ के दिन दूसरी महिला काे शॉपिंग करवाने आया था पति। पत्नी ने पकड़ा। https://t.co/T3jB1xVOWn pic.twitter.com/gSFGxGaghn
— Ankit tiwari/अंकित तिवारी (@ankitnbt) October 13, 2022