న్యూఢిల్లీ: కోతి పైకి రాయి విసిరేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే అది ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంటి వద్దకు వచ్చిన కోతిని తరిమేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు. దాని మీదకు రాయి విసిరేందుకు కిందకు వంగి రాయిని తీయబోయాడు. కాగా, ఆ వ్యక్తి చర్యను గమనించిన ఆ కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకుతుంది. దీంతో అతడు అదుపు తప్పి కిందపడ్డాడు. ఆ షాక్ నుంచి అతడు తేరుకుని పైకి లేచి కోతి కోసం అటూ ఇటూ చూస్తాడు. అయితే అప్పటికే అది అక్కడి నుంచి పారిపోతుంది.
కాగా, ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే ఐదు లక్షల మందికిపైగా ఈ వీడియోను చూశారు. నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. దాని పేరు జాన్ సేన అని పలువురు పేర్కొన్నారు. ఆ కోతి అతడికి బలే షాక్ ఇచ్చిందని కొందరు ఇమోజీలతో బదులిచ్చారు. అది గాల్లో ఎగిరి మెడలు విరగొట్టే కోతి అని ఒకరు అన్నారు. ఈ కోతి డబ్ల్యూడబ్ల్యూఈని చూస్తుందని ఒకరు చమత్కరించారు.
Kalesh B/w Moneky and A Human pic.twitter.com/YcHkI0ZVv4
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 19, 2022