Leopard | చిరుత పులిని తాడుతో బైకుకు కట్టేసి ఫారెస్ట్ ఆఫీసుకు తీసుకెళ్లిన రైతు
దానిని కోడి అనుకున్నాడో లేదా పిల్లి అనుకున్నాడో ఏకంగా చిరుత పులిని (Leopard) తన బైకు కట్టుకుని తీసుకెళ్లాడో రైతు. కర్ణాటకలోని (Karnataka) హసన్ (Hassan) జిల్లా బాగివాలు (Bagivalu) గ్రామానికి చెందిన ముత్తు (Muthu) అనే రైతు తన పొలానికి వెళ్తున్నాడు.
బెంగళూరు: దానిని కోడి అనుకున్నాడో లేదా పిల్లి అనుకున్నాడో ఏకంగా చిరుత పులిని (Leopard) తన బైకు కట్టుకుని తీసుకెళ్లాడో రైతు. కర్ణాటకలోని (Karnataka) హసన్ (Hassan) జిల్లా బాగివాలు (Bagivalu) గ్రామానికి చెందిన ముత్తు (Muthu) అనే రైతు తన పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతడికి 9 నెలల వయస్సున్న చిరుత పులి ఎదురుపడింది. మరి అది ఊకుంటుందా.. అతడిపై దాడికి దిగింది. అయితే తానేం తక్కువ అనుకున్నాడో ఏమో.. దానిపై ఎదురుదాడి చేశాడు. తన వద్ద ఉన్న తాడుతో దానిని బంధించాడు. దాని కాళ్లను తాడుతో కట్టేశాడు. చిరుతను తన బైక్‌కు వెనక కట్టుకుని (Tied) ఏకంగా అటవీ ఆఫీస్‌కు (Forest office) తీసుకెళ్లాడు.
అది చూసి విస్తుపోయిన సిబ్బంది వెంటనే దానిని దవాఖానకు తరలించారు. ముత్తు స్వల్పంగా గాయపడ్డాడని, చిరుత ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అవగాహన రాహిత్యంతో అతడు అలా చేశాడని చెప్పారు. అతనికి మరో ఉద్దేశం లేదన్నారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఆ రైతును వదిలేసినట్లు పేర్కొన్నారు. వన్య ప్రాణులు ఎదురుపడినప్పుడు మరోసారి ఇలాంటివి చేయకూడదని చెప్పినట్లు వెల్లడించారు. కాగా, స్వీయ రక్షణలో (Self Defence) భాగంగానే చిరుత పులిని కట్టేశానని ముత్తు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bagivalu
- bike
- forest office
- Hassan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

