న్యూఢిల్లీ: ఉబర్ యాప్‌లో ఆటో బుక్ చేసిన వ్యక్తి రైడ్ మధ్యలో బిల్లు చూసి షాక్ అయ్యాడు. రూ.7.66 కోట్లకు పైగా చెల్లించాలని అందులో చూపించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Rs.7.66 Crore Uber Auto bill) ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన దీపక్ టెంగూరియా శుక్రవారం తెల్లవారుజామున ఉబర్ యాప్ ద్వారా ఆటో బుక్ చేశాడు. తాను చేరాల్సిన ప్రాంతానికి రూ.62 చెల్లించాలని తొలుత అందులో చూపించింది.
కాగా, ఆటోలో ప్రయాణించిన దీపక్ ఆ ప్రాంతానికి చేరక ముందు ఉబర్ యాప్‌ను మరోసారి చెక్ చేశాడు. అయితే మొత్తం రూ.7,66 కోట్లకుపైగా చెల్లించాలని అందులో ఉండటం చూసి అతడు షాక్ అయ్యాడు. ట్రిప్ ఫేర్‌గా రూ.1,67,74,647 ఛార్జ్ చేయగా, వెయిటింగ్ కోసం రూ.5,99,09,189, ప్రొమోషన్ కాస్ట్ రూ.75తో కలిసి మొత్తం రూ.7,66 ,83,762 పే చేయాలని ఉబర్ యాప్‌లో కనిపించింది. ఎలాంటి జీఎస్టీ విధించలేదు. ఇది చూసి అతడు షాక్ అయ్యాడు. రైడ్ మధ్యలోనే ఆటో దిగిపోయాడు.
మరోవైపు దీపక్ స్నేహితుడు ఆశిష్ మిశ్రా ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. దీపక్, ఆశిష్ మధ్య దీని గురించి జరిగిన సంభాషణతోపాటు ఉబర్ యాప్‌లో రూ.7,66 ,83,762 పే చేయాలని చూపించిన స్కీన్ షాట్‌ను వీడియో తీసి పోస్ట్ చేశాడు. చంద్రుడి మీదకు టూర్ బుక్ చేసినప్పటికీ ఇంత ఖర్చు కాదేమోనని వ్యాఖ్యానించాడు. ఈ సంఘటన తర్వాత కోటీశ్వరుడు కావాలని భావించిన తన ఫ్రెండ్ ఉబెర్ ఫ్రాంచైజీ తీసుకోవాలని భావిస్తున్నాడని అందులో పేర్కొన్నాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో ఉబర్‌పై కొందరు కామెంట్లు చేశారు. మరి కొందరు ఆ సంస్థకు దీనిని షేర్ చేశారు. దీంతో ఉబర్ ఇండియా సంస్థ దీనిపై స్పందించింది. కలిగిన ఇబ్బందికి క్షమాపణలు కోరింది. ఈ సమస్యను పరిశీలిస్తున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది. అప్డేట్తో తిరిగి సంప్రదిస్తామని బదులిచ్చింది.
सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t
— Ashish Mishra (@ktakshish) March 29, 2024
Hey, sorry to hear about the trouble. Please allow us sometime while we are looking into this issue for you. We will get back to you with an update.
— Uber India Support (@UberIN_Support) March 29, 2024