Jailer 2 Trailer : సినీ అభిమానులు ఎదురు చూస్తున్న జైలర్ 2 ట్రైలర్ వచ్చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దర్శకత్వంలో వస్తున్న వస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ సిరీస్‌లో రిటైర్డ్ జైలర్ పాత్రలో ఒదిగిపోయిన రజనీ.. ఈసారి అండర్ వరల్డ్ ముప్పును ఎలా ఎదుర్కొన్నాడు? అనేది కథాంశం. జైలర్‌లో టైగర్ ముత్తువేల్ పాండ్యన్‌గా విగ్రహాల అక్రమ రవాణా మూఠా పీచమణిచిన రజనీ ఈ దఫా.. డ్రైవర్ పాత్రలో నటించారు. గ్యాంగ్స్టర్ల నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో విలన్ దిలీప్(సూరజ్ వెంజరమూడు) ఆట ఎలా కట్టించాడు? అనేది ఆసక్తి రేపుతోంది.
జైలర్‌లో కన్న కొడుకు కుట్రను ఛేదించిన ముత్తువేల్ పాండ్యాన్గా అలరించిన రజనీకాంత్ జైలర్ 2లోనూ అదే స్టయిల్, ఎనర్జీతో పూనకాలు తెప్పించనున్నారు. సోమవారం విడుదలైన ట్రైలర్ చూస్తే ఆ విషయం అందరికీ అర్ధమవుతుంది. తన కోసం వెతుకుతున్న గ్యాంగ్స్టర్లను ఒక్కచోట చేర్చి.. బాంబు పెట్టి పేల్చేయడమే ఇప్పటి ట్రెండ్ అంటూ రజనీ చెప్పిన డైలాగ్ అదిరింది. ఇక విలక్షణ నటుడైన సూరజ్ వెంజరమూడు దీపక్ అనే విలన్ పాత్రలో రజనీకి సవాల్ విసరుతాడు.
కళానిధి మారన్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఎస్జే సూర్య, బాలీవుడ్ నటి విద్యా బాలన్, కన్నడ స్టార్ శివకుమార్, మోహన్‌లాల్ వంటి పాపులర్ హీరోలు ప్రత్యేక పాత్రల్లో తళుక్కుమన్నారు. దసరా బరిలో కాసుల వర్షం కురిపించేందుకు వస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.