 
                                                            న్యూఢిల్లీ, జనవరి 6: కొద్దిపాటి చలికే మనం గజగజ వణికిపోతుంటాం. చిన్న ఐస్ ముక్కను కూడా ఎక్కువ సేపు పట్టుకోలేక వదిలేస్తుంటాం. అయితే పోలండ్‌కు చెందిన వలేర్జన్ రోమనోవ్సీ అనే వ్యక్తి ఐస్ గడ్డలతో నింపిన ఒక పెట్టెలో ఏకంగా మూడు గంటల పాటు నిలబడి ప్రపంచ రికార్డు సాధించాడు. ఆ సమయంలో మెడ వరకు అతడి శరీరం ఐస్ లోపలే ఉన్నది.
గత రికార్డులను బద్దలుకొడుతూ రోమనోవ్సీ చేసిన విన్యాసానికి సంబంధించిన వీడియోను గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్(జీడబ్ల్యూఆర్) షేర్ చేసింది. గతంలో ఐస్ బాక్స్‌లో 2 గంటల 35 నిమిషాల పాటు నిలబడిన ఫ్రాన్స్‌కు చెందిన రొమైన్ వందెన్డోర్స్ పేరిట ఈ వరల్డ్ రికార్డు ఉండేది. తన రికార్డుపై రోమనోవ్సీ స్పందిస్తూ ఇందుకోసం గత ఆర్నెళ్లుగా శిక్షణ తీసుకొంటున్నానని, శరీరాన్ని అందుకు అనుగుణంగా మార్చుకొన్నానని పేర్కొన్నారు.
 
                            