లక్నో: కలిసి చదివిన యువతిని ఒక వ్యక్తి ఇష్టపడ్డాడు. అయితే ఆమెకు మరో వ్యక్తితో పెళ్లి జరుగుతున్నదని తెలిసి సహించలేకపోయాడు. ఈ నేపథ్యంలో గన్‌తో కాల్పులు జరిపి ఆ మహిళను హత్య చేశాడు. (Man Shoots Woman Dead) ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కరోండా చౌదరి గ్రామానికి చెందిన శివంగ్ త్యాగి, 25 ఏళ్ల భావన కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలో త్యాగి ఆమెను ఇష్టపడ్డాడు.
కాగా, మే 1న మరో వ్యక్తితో భావన పెళ్లి జరుగనున్నది. ఈ నేపథ్యంలో త్యాగి ఆమెపై కోపం పెంచుకున్నాడు. శనివారం తన తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తున్న భావనపై బాధాపూర్ గ్రామ సమీపంలో గన్‌తో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను తండ్రి ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే భావన మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
మరోవైపు భావనను కాల్చి చంపిన త్యాగి అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హత్యకు వినియోగించిన పిస్టల్‌ను పోలీసులకు అప్పగించాడు. తాను ఇష్టపడిన ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సహించలేక చంపినట్లు చెప్పాడు. దీంతో త్యాగిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.