Manipur: మణిపూర్‌లో నగ్నంగా మహిళల ఊరేగింపు.. వ్యక్తి అరెస్టు
Manipur Incident: ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన నిందితుడికి మరణశిక్ష విధిస్తామని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. బుధవారం వైరల్ అయిన ఓ వీడియోపై ఆయన స్పందించారు. తన ట్వీట్లో ఆ ఘటనను ఆయన ఖండించారు. ఓ నిందితుడు హీరాదాస్‌ను అరెస్టు చేశారు.
ఇంఫాల్: మణిపూర్(Manipur)లో రెండు తెగల మధ్య చాన్నాళ్ల నుంచి ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే రెండు నెలల క్రితం ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అయ్యింది. ఆ మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతన్ని 32 ఏళ్ల హీరాదాస్‌గా గుర్తించారు. అతనిది తౌబాల్ జిల్లా. వీడియోలో గ్రీన్ షర్ట్ వేసుకున్న వ్యక్తే అతను.
My hearts go out to the two women who were subjected to a deeply disrespectful and inhumane act, as shown in the distressing video that surfaced yesterday. After taking a Suo-moto cognisance of the incident immediately after the video surfaced, the Manipur Police swung to action…
— N. Biren Singh (@NBirenSingh) July 20, 2023
మణిపూర్‌లోని కంగ్‌పోప్కీ జిల్లాలో మే 4వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే బుధవారం ఆ వీడియో మరోసారి వైరల్ అయ్యింది. ఆ వీడియోపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ స్పందించారు. నిందితులకు మరణదండన ఉంటుందన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, మర్డర్ కింద కేసు బుక్ చేశారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు 12 బృందాలుగా అన్వేషించారు.
మహిళల్ని నగ్నంగా పరేడ్ చేయించిన ఘటనను సుమోటోగా తీసుకుని దర్యాప్తు చేపట్టామని, ఇవాళ ఉదయం ఒకర్ని అరెస్టు చేసినట్లు సీఎం బీరేన్ సింగ్ తెలిపారు. సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు కఠిన శిక్ష విధిస్తామన్నారు. ఇలాంటి ఘటనలకు సమాజంలో చోటులేదన్నారు. కుకీ తెగను చెందిన మహిళల్ని.. మైటేయి తెగకు చెందిన వ్యక్తులు నగ్నంగా ఊరేగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

