చుట్టూ నీళ్లు..మధ్యలో స్థంభం.. ఆ స్థంభం వద్దకు వచ్చిన ఓ ఆవు కరెంట్ షాక్తో గిలగిలా కొట్టుకుంది. ఇది చూసి ఓ దుకాణ యజమాని చలించిపోయాడు. వెంటనే ప్రాణాలకు తెగించి ఆ ఆవును కాపాడాడు. మానవత్వాన్ని చాటుకున్నాడు. పంజాబ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘అనామిక జైన్ ఆంబర్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఆవు ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని తాకడంతో కరెంటు షాక్కు గురై కొట్టుకుంటోంది. ఆ ఆవును చూసిన దుకాణదారుడు పరుగెత్తుకుంటూ వచ్చి నీట్లోకి దూకాడు. ఓ గుడ్డతో ఆవు కాళ్లను కట్టి లాగాడు. చుట్టుపక్కలవారి సహాయంతో దాన్ని ప్రాణాలతో కాపాడాడు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోకు లక్షకుపైగా లైక్స్ రావడం విశేషం. ఆ దుకాణాదారుడిని రియల్ హీరో అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
करंट लगने से छटपटाती हुई गाय को एक दुकानदार ने कपड़े से खींच कर बचाया।
ये है मानवता का उदाहरण🙏🏻 pic.twitter.com/jRlaxYyv6w— Anamika Jain Amber (@anamikamber) July 2, 2022