CM Vijay convoy | సీఎం విజయ్ పర్యటనలో భద్రతా లోపం.. కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన వ్యక్తి
టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ కరూర్ జిల్లా పర్యనటలో భద్రతా లోపం చోటుచేసుకుంది.
Thamilanadu | టీవీకే చీఫ్, తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ కరూర్ జిల్లా పర్యనటలో భద్రతా లోపం చోటుచేసుకుంది. కరూర్‌లోకి ప్రవేశిస్తుండగా భారీ భద్రతను దాటుకుని ఓ వ్యక్తి ఆయన కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించాడు. సీఎం వాహనం వద్దకు చేరుకునే లోపే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అతడిని అడ్డుకుని పక్కకు లాగేశారు. వేలాది మంది మద్దతుదారులు దారి పొడవునా గుమిగూడి విజయ్‌కు మద్దతుగా పూల రేకులు చల్లుతూ, నినాదాలు చేశారు.
జనసమూహాలను నియంత్రించడానికి పోలీసులు బారికేడ్లు, సిబ్బందితో సహా విస్తృత భద్రతా చర్యలను చేపట్టారు. అయినప్పటికి ఓ వ్యక్తి భద్రతను దాటుకొని ముందుకెళ్లడం గమనార్హం. కాగా, 2025 సెప్టెంబర్ 27న టీవీకే నిర్వహించిన బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సీఎం విజయ్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలను పరామర్శించి వారికి సహాయం, ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడానికి వచ్చిన సమయంలో ఈ సంఘటన జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

