లక్నో: రామ్ లీలా ప్రదర్శన సందర్భంగా మరో విషాదకర సంఘటన జరిగింది. హారతి ఇస్తుండగా శివుడు వేషధారి ఒక్కసారిగా వేదికపై కుప్పకూలి మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోమవారం రాత్రి బెలాసిన్ గ్రామంలో రామ్ లీలా ప్రదర్శన నిర్వహించారు. రామ్ ప్రసాద్ అలియాస్ చబ్బన్ పాండే అనే వ్యక్తి శివుడి వేషం వేశాడు. ప్రదర్శనలో భాగంగా పూజారి శివుడి వేషంలో ఉన్న అతడికి హారతి ఇచ్చాడు.
అయితే శివుడు వేషం వేసిన రామ్ ప్రసాద్ ఉన్నట్టుండి వెనక్కి పడిపోయాడు. వేదికపై కుప్పకూలిన అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఈ సంఘటన నేపథ్యంలో రామ్ లీలా ప్రదర్శనను నిలిపివేశారు.
రామ్ ప్రసాద్ గత ఆరేళ్లుగా శివుడి పాత్ర వేస్తున్నట్లు స్థానికులు చెప్పారు. అతడి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు స్థానికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
आरती के दौरान अचानक मंच पर गिर पड़ा शख्स | Unseen India pic.twitter.com/M8wdUhu1NF
— UnSeen India (@USIndia_) October 11, 2022