Roommateను చంపి.. పూడ్చేసి.. రూంలో ప్రశాంతంగా పడుకున్నాడు..
Roommate| ఇద్దరు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. ఒక్కటే గదిలో ఉంటున్నారు. చిన్న విషయంలో లొల్లి పెట్టుకున్నారు. దీంతో రూమ్మెట్‌ను చంపిన యువకుడు.. మృతదేహాన్ని పూడ్చేసి ఏమీ తెలియనట్లు రూమ్‌లో ప్రశాంతంగా పడుకున్నాడు.

ముంబై: ఇద్దరు ఒకే దగ్గర పనిచేస్తున్నారు. ఒక్కటే గదిలో ఉంటున్నారు. చిన్న విషయంలో లొల్లి పెట్టుకున్నారు. దీంతో రూమ్మెట్‌ను చంపిన యువకుడు.. మృతదేహాన్ని పూడ్చేసి ఏమీ తెలియనట్లు రూమ్‌లో ప్రశాంతంగా పడుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది.
నాగ్‌పూర్‌లోని దాభా ప్రాంతంలోని ఓ గ్యారేజీలో రాజు నందేశ్వర్ (35), దేవాన్ష్ వఘోడే (26) మేకానిక్లుగా పనిచేస్తున్నారు. గ్యారేజీకి సమీపంలో ఓ గదిలో ఇద్దరు కిరాయికి ఉంటున్నారు. అయితే గత శనివారం రాత్రి పని ముగించుకుని గదికి వెళ్లిన తర్వాత ఇద్దరికి చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. అదికాస్తా ముదిరి ఇద్దరు కొట్టుకునేదాకా వెళ్లింది. ఈ క్రమంలో దేవాన్ష్ చేతికి దొరికిన ఓ పదునైన వస్తువుతో రాజును బలంగా కొట్టాడు. దీంతో రాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడు మృతిచెందాడని నిర్ధారించుకున్న దేవాన్ష్.. రాజు మృతదేహాన్ని అదేరోజు రాత్రి తాముంటున్న గదికి సమీపంలోని ఓ ఖాళీ ప్రదేశంలో పాతిపెట్టాడు. అనంతరం తిరిగివచ్చి గదినంతా శుభ్రం చేసుకుని ఏమీ తెలియనట్లు ప్రశాంతంగా పడుకున్నాడు.
అయితే ఆదివారం ఉదయం ఖాళీ ప్రదేశంలో ఏదో పూడ్చినట్లు అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడ పరిశీలించిన పోలీసులకు అసలు విషయం బయటకు వచ్చింది అధికారులు తెలిపారు. దేవాన్ష్‌ను తమదైనశైలిలో ప్రశ్నించడంతో తానే హత్యకుపాల్పడినట్లు తెలిపాడన్నారు. దీంతో అతడిని అరెస్టుచేశామని, హత్యా నేరం కింద కేసు నమోదుచేశామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Dump
- Maharashtra
- Nagpur
- Roommate
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

