భార్యపై కోపంతో పిల్లలను చంపిన భర్త
భార్యపై కోపం| బీహార్‌లోని పట్నాలో ఘోరం జరిగింది. తనపై భార్య కేసు పెట్టిందన్న కోపంతో పిల్లలను చంపాడో భర్త. పట్నా రూరల్ జిల్లా కన్హాయ్‌పూర్ గ్రామానికి చెందిన కమల్‌దేవ్.. వీణా దేవి అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

పట్నా: బీహార్‌లోని పట్నాలో ఘోరం జరిగింది. తనపై భార్య కేసు పెట్టిందన్న కోపంతో పిల్లలను చంపాడో భర్త. పట్నా రూరల్ జిల్లా కన్హాయ్‌పూర్ గ్రామానికి చెందిన కమల్‌దేవ్.. వీణా దేవి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి అంకిత్ కుమార్ (6), అలీషా (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, వారిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీణా దేవి పలువురితో అక్రమసంబంధం కలిగి ఉందని, ఆమెతో కమల్‌దేవ్ తరచూ గొడవపెట్టుకునేవాడు. ఈ క్రమంలో ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె పిల్లలను అక్కడే వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో కలిసి కమల్దేవ్పై గృహహింస, అదనపు కట్నం అడుగుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో భార్యపై కోపంతో శుక్రవారం తెల్లవారుజామున ఘాడ నిద్రలో ఉన్న చిన్నారుల తలపై బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఉదయం 5 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన భార్య పలువురితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నదని, ఆ పిల్లలు తన వల్ల కలిగిన సంతానం కాదని చెబుతూ మానసికంగా వేదించేదని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నేపాల్ పార్లమెంట్ రద్దు.. నవంబర్‌లో ఎన్నికలు
కూలిన సొరంగం.. నలుగురు కూలీలు మృతి
‘ఎయిరిండియా’పై సైబర్ ఎటాక్
చెప్పినదానికన్నా రెట్టింపు మరణాలు
తెహల్కా మాజీ ఎడిటర్ తేజ్‌పాల్‌కు విముక్తి
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- Complaint
- minor daughter
- Wife
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

