ముంబై: ఒక జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్ దాడి చేశాడు. వ్యాయామం కోసం వినియోగించే కర్ర క్లబ్‌తో అతడి తలపై కొట్టాడు. (Gym Trainer Hits Man) బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ జిమ్ ట్రైనర్‌ను అరెస్ట్ చేశారు. సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల యోగేష్ షిండే గత రెండేళ్లుగా ములుండ్ ఈస్ట్‌లోని జిమ్‌కు వెళ్తున్నాడు. బుధవారం జిమ్‌లో ఒక ట్రైనర్ సహాయంతో అతడు వ్యాయామాలు చేస్తున్నాడు.
కాగా, జిమ్‌లో ఒక పక్కన నిల్చొన్న మరో ట్రైనర్ ధారవి నాకెల్ ఉన్నట్టుండి వ్యాయామాల కోసం వినియోగించే ఉడెన్ క్లబ్‌ను చేతిలో పట్టుకున్నాడు. యోగేష్ షిండే వద్దకు వెళ్లి అతడి తలపై దానితో కొట్టాడు. అక్కడున్న వారు ఆ ట్రైనర్‌ను అడ్డుకున్నారు. యోగేష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎంఆర్ఐ స్కాన్ చేయగా అతడి పుర్రె ఎడమ వైపున రెండు పగుళ్లు ఏర్పడినట్లు వైద్య పరీక్షలో తేలింది.
మరోవైపు దాడి చేసిన జిమ్ ట్రైనర్ నాకెల్పై పోలీసులకు యోగేష్ ఫిర్యాదు చేశాడు. ఆ ట్రైనర్‌తో తనకు ఎలాంటి గొడవలు లేవని తెలిపాడు. దాడికి ముందు అతడి వైపు చూశానని పోలీసులకు చెప్పాడు. వ్యాయామాలు తప్పుగా చేస్తున్నానా? అని కూడా అడిగానని, సమాధానం ఇవ్వని అతడు అకస్మాత్తుగా తనపై దాడి చేసినట్లు ఆరోపించాడు.
కాగా, యోగేష్ జోక్ చేయడంతో ఆగ్రహించిన ట్రైనర్ అతడిపై దాడి చేసినట్లు తెలుస్తున్నది. కేసు నమోదు చేసిన పోలీసులు జిమ్ ట్రైనర్ నాకెల్ను అరెస్ట్ చేశారు. మరోవైపు ఆ జిమ్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मुंबईतील जिममधील धक्कादायक सीसीटीव्ही फुटेज समोर pic.twitter.com/uFz8tXl4Qb
— News18Lokmat (@News18lokmat) July 18, 2024