triple talaq | మోదీ, యోగిని ప్రశంసించిన ముస్లిం మహిళ.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
triple talaq | ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఒక ముస్లిం మహిళ ప్రశంసించింది. దీనిపై ఆగ్రహించిన ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఒక ముస్లిం మహిళ ప్రశంసించింది. దీనిపై ఆగ్రహించిన ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పి (triple talaq) విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొహల్లా సరాయ్ ప్రాంతానికి చెందిన ముస్లిం మహిళకు గత ఏడాది డిసెంబర్ 13న అయోధ్యలోని మొహల్లా ఢిల్లీ దర్వాజా ప్రాంతానికి చెందిన అర్షద్‌తో వివాహం జరిగింది.
కాగా, పెళ్లి తర్వాత అయోధ్యలోని అత్తవారింటికి చేరుకున్న ఆ ముస్లిం మహిళకు అక్కడి రోడ్లు, సుందరీకరణ, అభివృద్ధి, వాతావరణం ఎంతో నచ్చాయి. దీంతో భర్త ముందు సీఎం యోగి, ప్రధాని మోదీని ఆమె ప్రశంసించింది. ఆగ్రహించిన భర్త అర్షద్ భార్యను కొట్టడంతోపాటు కాలుతున్న పాన్‌ను ఆమెపై విసిరాడు. అలాగే భార్యను పుట్టింటికి పంపేశాడు.
మరోవైపు కొన్ని రోజుల తర్వాత బంధువుల జోక్యంతో ఆ మహిళ తిరిగి అయోధ్యలోని భర్త ఇంటికి చేరుకున్నది. అనంతరం భర్త తనను కొట్టడంతోపాటు మోదీ, యోగిని ప్రశంసించినందుకు తిట్టి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇచ్చాడని ఆ మహిళ ఆరోపించింది. భర్తతో పాటు అత్తింటి వారు కూడా తనను వేధించి చిత్రహింసలకు గరిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అర్షద్, అతడి కుటుంబ సభ్యులతో సహా 8 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- MAN
- Pm Modi
- praising
- Triple talaq
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

