న్యూఢిల్లీ : ఇష్టమైన ఫుడ్ కోసం ఎవరైనా మహా అయితే ప్రతి వారం అదే ఆహారాన్ని తీసుకుంటారు..అదే వంటకంలో పలు వెరైటీలను టేస్ట్ చేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి తన ఫేవరెట్ డిష్ రాజ్మా చావల్‌ను తన చేతిపై టాటూ వేయించుకున్నాడు.
ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు ఇష్టపడేది ఏదైనా ఎప్పటికీ మీతోనే ఉంటుందని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభించింది. వడపావ్ కోసం ఓ టాటూ, పావ్‌భాజీ కోసం మరోటి అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా ఇది ఎప్పటికీ రియల్ అంటూ మరో యూజర్ కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.