అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
man found hanging, girlfriend locked | ఒక జంట అన్నాచెల్లెలుగా పేర్కొంటూ ఒక అద్దె ఇంట్లో కలిసి సహజీవనం చేశారు. వారిద్దరి మధ్య గొడవ వల్ల యువకుడు ఉరి వేసుకున్నాడు. ప్రియురాలైన ఆ యువతి లాక్ చేసిన మరో గదిలో ఉన్నది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పాట్నా: ఒక జంట అన్నాచెల్లెలుగా పేర్కొంటూ ఒక అద్దె ఇంట్లో కలిసి సహజీవనం చేశారు. వారిద్దరి మధ్య గొడవ వల్ల యువకుడు ఉరి వేసుకున్నాడు. ప్రియురాలైన ఆ యువతి లాక్ చేసిన మరో గదిలో ఉన్నది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (man found hanging, girlfriend locked) బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహేష్పూర్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల అమృత్ శర్మ, నీమా చంద్పురాకు చెందిన 20 ఏళ్ల అర్చన కుమారి తొమ్మిది నెలలుగా ప్రేమలో ఉన్నారు.
కాగా, నెల కిందట పిప్రా గ్రామంలోని ఒక ఇంటిని అర్చన అద్దెకు తీసుకున్నది. ఇంటి యజమానికి సమర్పించిన ఆధార్ కార్డు కాపీలో, డానియల్పూర్ అనే తప్పుడు చిరునామాతో పాటు ప్రియుడు అమృత్ తండ్రి భరత్ శర్మను తన తండ్రిగా పేర్కొంది. పోటీ పరీక్షలకు తాను సిద్ధమవుతున్నట్లు ఇంటి యజమానికి తెలిపింది. అలాగే ప్రియుడైన అమృత్‌ను సోదరుడిగా నమ్మించింది. అతడు కూడా తనతో పాటు కలిసి ఆ ఇంట్లో ఉంటాడని ఇంటి యజమానికి చెప్పింది.
మరోవైపు 15 రోజుల తర్వాత అమృత్ ఆ అద్దె ఇంటికి వచ్చాడు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాను పని చేస్తున్నట్లు ఇంటి యజమానికి తెలిపాడు. అర్చన చిరునామా వివరాలు మాదిరిగానే అతడు సమర్పించిన ఆధార్ కార్డులో తండ్రి పేరు, చిరునామా ఉన్నాయి. నాటి నుంచి వారిద్దరూ ఆ ఇంట్లో కలిసి సహజీవనం చేశారు.
అయితే వారిద్దరి మధ్య సంబంధంపై ఇంటి యజమానికి అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో ఆ జంట ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడించారు. వారి తండ్రిగా అతడు పరిచయం చేసుకున్నాడు. వారిద్దరి నుంచి ఎలాంటి పొరపాటు జరుగకుండా చూసుకుంటానని ఇంటి యజమానికి ఆ వ్యక్తి భరోసా ఇచ్చాడు.
కాగా, అక్టోబర్ 30న రాత్రివేళ ఒక విషయంపై అర్చన, అమృత్ మధ్య గొడవ జరిగింది. దీంతో అర్చనను ఒక గదిలో అతడు బంధించాడు. మరో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్‌కు అమృత్ స్పందించకపోవడంతో అతడి సోదరుడికి అర్చన ఫోన్ చేసింది. దీంతో అమృత్ సోదరుడు ఆ ఇంటికి చేరుకున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఇంటి తలుపులు తెరిచి చూడగా ఒక గదిలో అమృత్ ఉరి వేసుకుని కనిపించాడు. లాక్ వేసిన మరో గదిలో అర్చన ఉన్నది.
అయితే అర్చన మాజీ ప్రియుడి నుంచి అమృత్‌కు బెదిరింపులు వచ్చినట్లు అతడి సోదరుడు ఆరోపించాడు. పనికి సంబంధించిన విషయాల కోసం అప్పుడప్పుడు ఆమెతో తాను మాట్లాడినట్లు పోలీసులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో అమృత్ మరణానికి దారితీసిన పరిస్థితులు, అతడి కుటుంబం ఆరోపణలపై అర్చనను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అమృత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bihar
- girlfriend
- hanging
- locked
RELATED ARTICLES
తాజా వార్తలు
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
Polio | పోలియో అసలు ఎలా వస్తుంది.. రెండు రకాల టీకాలను ఎందుకు వేయించాలి..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

