న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓ వ్యక్తి రోడ్డు మీద ఆవుల కోసం రొట్టెలు విసరేశాడు. గోవులకు ఫీడింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అతను ఆ పనిచేశాడు. అయితే ఆ సమయంలో ఆ రూట్లో వెళ్తున్న ఢిల్లీ సీఎం(Delhi CM) రేఖా గుప్తా తన కాన్వాయ్ వాహనాన్ని ఆపి ఆ వ్యక్తితో సంభాషించారు. కారులో నుంచి రొట్టెలు విసిరేసిన వ్యక్తితో మాట్లాడుతూ.. ఇలా చేయవద్దు అని ఆమె అభ్యర్థించారు. రొట్టెలను ఆహారంగా మాత్రమే చూడమని, అది మన సంస్కృతి, విశ్వాసం, గౌరవాలకు గుర్తింపు అని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యక్తితో సంభాషించిన వీడియోను ఆమె తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు.
వీధుల్లో తిరగే గోవులకు ఆహారం వేయవద్దు అని, ఒకవేళ అలా చేయాలంటే గోశాలలకు వెళ్లాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆ వ్యక్తికి సూచించారు. కారులో ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లి రెండు చేతులు జోడించి ఆ వ్యక్తితో మాట్లాడారు. రోడ్డు మీద ఆహారాన్ని వేయడం వల్ల ఆవులు, ఇతర జంతువులు జనం మధ్యకు వస్తున్నాయని, దీని వల్ల ఆ జంతువులకు ఇబ్బంది, ఇక ప్రజల భద్రతకు కూడా సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు సీఎం రేఖా గుప్తా తెలిపారు.
ఆహారాన్ని అగౌరపరుచరాదు అని, జంతువులకు ఫీడింగ్ ఇవ్వాలనుకుంటే, గోశాలకు వెళ్లాలని ఆమె పేర్కొన్నారు. అది మన బాధ్యత, విలువలను చాటుతుందన్నారు. దేశ రాజధానిలో మోడల్ గోశాలలు ఏర్పాటు చేసేందుకు రూ.40 కోట్లు కేటాయించింది ఢిల్లీ సర్కారు.
आज राजधानी में भ्रमण के दौरान, मैंने देखा कि एक व्यक्ति ने अपनी कार से रोटी सड़क पर फेंकी- संभवतः गाय को खिलाने के उद्देश्य से। मैंने गाड़ी रुकवाई और उस व्यक्ति से आग्रह किया कि कृपया ऐसा दोबारा न करें।
रोटी हमारे लिए केवल भोजन नहीं है, वह हमारी संस्कृति, श्रद्धा और सम्मान का… pic.twitter.com/PS0bYmOBG6— Rekha Gupta (@gupta_rekha) April 12, 2025