ప్రేమతో బిడ్డకు బీరు తాపి.. తండ్రి జైలుపాలు..!
Father feed beer to daughter: కానీ కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లాలోని హోస్‌దుర్గ్‌లో మాత్రం ఓ తండ్రి తన కూతురుపై ప్రేమతో ఏకంగా బీరు తాపించిండు.

కాసర్గోడ్: పిల్లలపై ప్రేమతో ఎవరైనా బిస్కెట్లు, చాక్లెట్లు కొనిపెడుతారు. అవసరమైతే షాప్‌కు తీసుకెళ్లి వాళ్లు అడిగిందల్లా కొనిస్తారు. కానీ కేరళ రాష్ట్రం కాసర్గోడ్ జిల్లాలోని హోస్‌దుర్గ్‌లో మాత్రం ఓ తండ్రి తన కూతురుపై ప్రేమతో ఏకంగా బీరు తాపించిండు. కానీ బీరు తాగిన బాలిక స్పృహ తప్పి ఆస్పత్రి పాలయ్యింది. దాంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. హోస్‌దుర్గ్‌లోని తోయమ్మాల్ గ్రామానికి చెందిన రాధాకృష్ణన్ ఇంట్లో బీరు తాగుతూ తన ఎనిమిదేండ్ల కూతురుకు కూడా పట్టించాడు. అయితే ఆ బాలిక కళ్లు తిరిగి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు బాలిక వాంగ్మూలం నమోదు చేశారు.
బాలిక వాంగ్మూలం ఆధారంగా ఆమె తండ్రి రాధాకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతనికి రెండు వారాల జైలుశిక్ష విధించింది. దాంతో పోలీసులు అతడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

