Snake begger | పామును చూపి బెదిరిస్తూ రైల్లో ఓ వ్యక్తి భిక్షాటన.. Video
Snake begger | అడుక్కునే పద్ధతులు కూడా రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సాధారణంగా అంగవైకల్యాన్ని చూపించో, పసిబిడ్డలకు పాలు లేవని చెప్పో, తినడానికి తిండిలేదని చెప్పో భిక్షాటన (Begging) చేస్తుంటారు.
Snake begger : అడుక్కునే పద్ధతులు కూడా రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. సాధారణంగా అంగవైకల్యాన్ని చూపించో, పసిబిడ్డలకు పాలు లేవని చెప్పో, తినడానికి తిండిలేదని చెప్పో భిక్షాటన (Begging) చేస్తుంటారు. కొందరు తమ ఆటను చూపించి, కొందరు తమ పాటను చూపించి, మరికొందరు తమ ఇంద్రజాల శక్తులను ప్రదర్శించి భిక్షం అడుగుతారు. కానీ తాజాగా గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరానికి చెందిన ఓ వ్యక్తి మాత్రం భిక్షాటన కోసం పైవాటికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
ప్రయాణికులకు పామును చూపించి భయపెడుతూ భిక్షాటన చేస్తున్నాడు. సదరు వ్యక్తి పాముతో తమ దగ్గరికి వచ్చే సరికి ప్రయాణికులు భయపడి వెంటనే డబ్బులు ఇస్తున్నారు. ఇటీవల సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఆ వ్యక్తి ఇలా డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలను ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేయాలని ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిని కోరారు. అదేవిధంగా సదరు వ్యక్తిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రైల్వే ప్రొటెక్షన్ పోలీసులను ఆదేశించింది. సదరు స్నేక్ బెగ్గర్ అహ్మదాబాద్‌లోని మంగోలి రైల్వేస్టేషన్ దగ్గర రైలు ఎక్కినట్లు తెలుస్తోంది.
#Sarp_darshan_on_Rail
Man with snake boarded at Mungaoli (M.P.)
New way of Taking out #money from Hard Working Labour class
inside #IndianRailways @RailwaySeva @RailMinIndia @Central_Railwaytrain : Ahmedabad Sabarmati Express
Location: Between Mungaoli to Bina Junction. pic.twitter.com/7vM4UhcCaq— Deepak रघुवंशी 🇮🇳 (@draghu888) September 22, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

