న్యూఢిల్లీ : ఓ వ్యక్తి తన పెండ్లి వేడుకకు బంధువులను తోడ్కొనివెళ్లేందుకు ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భువన్ అనే వ్యక్తి తన పెండ్లి కోసం మొత్తం విమానాన్ని బుక్ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వైరల్ వీడియోకు ఇప్పటివరకూ పది లక్షలకుపైగా వ్యూస్ లభించాయి.
శుభ్ వెడ్డింగ్ అనే పేజ్‌లో ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు. ఈ షార్ట్ క్లిప్‌లో భువన్ కుటుంబ సభ్యులు, బంధువులు కెమెరా వైపు చూస్తూ కేరింతలు కొట్టడం కనిపిస్తుంది. తన చేతులపై మెహందీతో భువన్ సైతం ఈ క్లిప్‌లో కనిపించాడు.
ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. మీరు సంపన్నులని చెప్పకనే చెబుతున్నారని ఓ యూజర్ కామెంట్ చేయగా, జీవితంలో ఇంత డబ్బు సంపాదిస్తే చాలని మరో యూజర్ రాసుకొచ్చారు.