బెంగళూరు: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కక్షతో ఒక వ్యక్తి ఆమె ప్రియుడి గొంతు కోసి రక్తాన్ని తాగిన ఒళ్లు గగుర్పొడిచే సంఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్‌లో జరిగింది. ఈ దృశ్యాన్ని నిందితుడి స్నేహితుడు వీడియో తీసి వైరల్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని విజయ్‌గా, బాధితుడిని మారేష్గా గుర్తించారు. చిక్కబళ్లాపూర్‌లో నివసించే విజయ్.. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో మారేష్‌ను ఈనెల 19న మభ్యపెట్టి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లాడు. అడవిలో మారేష్‌పై దాడి చేసి గొంతు కోసిన విజయ్, అతని రక్తాన్ని తాగాడు. మారేష్ ప్రస్తుతం కోలుకున్నాడు. జాన్ తీసిన వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.