రాజ్‌కోట్ : సొంతగడ్డపై ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత కుర్రాళ్లు అదరగొడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 217కే ఆలౌట్ చేసిన భారత అండర్-19 జట్టు తర్వాత బ్యాటింగ్ చేస్తూ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 430 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందని (256 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్స్‌లతో 210 బ్యాటింగ్) అజేయ ద్విశతకంతో రెచ్చిపోయాడు. కెప్టెన్ యశ్వర్దన్ (54), మోహిత్ ఉల్వ (58 బ్యాటింగ్) రాణించారు.