చెన్నై, జూన్ 26: బంధువుల్లో అమ్మాయిలను చూసి నచ్చితే పెండ్లి చేసుకోవడం ఒక పద్ధతి. మ్యారేజీ బ్రోకర్లను సంప్రదించడం, మాట్రిమోనీ సైట్లు, పేపర్లో ప్రకటనల ద్వారా తగిన అమ్మాయిని వెతుక్కోవడం మరో పద్ధతి.
ఈ రెండు పద్ధతుల్లోనూ నచ్చిన అమ్మాయి దొరక్కపోతే? అందుకే తనకు నచ్చిన, తనను మెచ్చిన అమ్మాయిని వెతుక్కోవడం కోసం తమిళనాడులోని విల్లాపురానికి చెందిన ఎమ్మెస్ జగన్ వినూత్న చర్యకు దిగాడు. ‘పేరు: ఎమ్మెస్ జగన్. వయస్సు: 27 ఏండ్లు. జీతం నెలకు నలభైవేలు. నాకు వధువు కావలెను’ అంటూ మధురై అంతటా రోడ్ల కూడళ్లలో ఇలా బ్యానర్లు కట్టాడు.