Mamata Banerjee | సీఎం పదవికి రాజీనామా చేయనంటున్న మమతా బెనర్జీ.. మరి చట్టం ఏం చెబుతోంది..?
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయబోనని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, బలవంతంగా తమ రాష్ట్రాన్ని ఆక్రమించారని ఆమె విమర్శిస్తున్నారు.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయబోనని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, బలవంతంగా తమ రాష్ట్రాన్ని ఆక్రమించారని ఆమె విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసేది లేదని మంగళవారం ప్రకటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
294 సీట్లకుగాను, బీజేపీకి 206 సీట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అధికారం చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం మమతా బెనర్జీ తన సీఎం పదవికి రాజీనామా చేయాలి. మరోవైపు ఈ నెల 9న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో మమత తన పదవికి రాజీనామా చేయకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి..? ఈ విషయంలో చట్టం, రాజ్యాంగం ఏం చెబుతోంది..?
రాజ్యాంగ నిపుణుల ప్రకారం.. మమత తన సీఎం పదవికి రాజీనామా చేయకపోయినా.. కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు, కొత్త ముఖ్యమంత్రి పదవీ ప్రమాణం చేసే వరకు ఆమె పదవిలో కొనసాగవచ్చు. అయితే, రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ల తర్వాత పాత ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. దీని ప్రకారం మే 7న కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. అంటే, మే 6 వరకు ఆమె పదవిలో ఉండటానికి అవకాశం ఉంది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఎలాగూ రద్దవుతుంది. మమత రాజీనామా చేయకపోయినా.. ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం రద్దవ్వాలి కాబట్టి.. గవర్నర్ మమత ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు.
మమత పదవికి రాజీనామ చేయకపోవడం రాజ్యాంగానికి వ్యతిరేకమే. ఆమె నిబంధనలు పాటించకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్కు ఉంది. లేదంటే సభలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ కోరవచ్చు. ప్రస్తుతం ఆమెకు మెజారిటీ లేదు కాబట్టి.. అక్కడైనా మమత ప్రభుత్వం రద్దవుతుంది. ఆ తర్వాత మెజారిటీ సాధించిన బీజేపీ అధికారం చేపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే.. అప్పుడు రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తంలో గవర్నర్ పాత్ర కీలకం. ఆయన పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తారు.
మమత ఆరోపణల సంగతేంటి..
పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలవడంపై మమత అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, బీజేపీకి ఈసీ అనుకూలంగా వ్యవహరించిందని, సర్ ద్వారా ఓట్లు తొలగించారని, అన్యాయంగా, అక్రమంగా గెలిచారని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల్ని ఆమె చట్టబద్ధంగా ప్రశ్నించవచ్చు. కోర్టుల్లో, చట్టసభల్లో దీనిపై విచారణ కోరవచ్చు. అలాగని, అప్పటివరకు ఆమె పదవిలో కొనసాగే అర్హత మాత్రం లేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

