హైదరాబాద్ : ఓ ఫ్రంట్ లైన్ వర్కర్ 6 నెలల తర్వాత కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనాతో పోరాడుతున్న సమయంలోనే అతనికి గుండెపోటు వచ్చింది. అయినప్పటికీ అతనికి వైద్యులు అందించిన చికిత్స విజయవంతమైంది.
కేరళకు చెందిన అరుణ్ కుమార్ ఎం నాయర్ అనే వ్యక్తి అబుదాబిలోని ఎల్ఎల్హె్ ఆస్పత్రిలో ఆపరేటింగ్ థియేటర్లో టెక్నిషీయన్‌గా విధులు నిర్వరిస్తున్నాడు. అయితే 2021, జులై నెలలో అరుణ్ కుమార్ కరోనా బారినపడ్డాడు. దీంతో అరుణ్ క్వారంటైన్లోకి వెళ్లాడు. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. శ్వాస సంబంధిత సమస్యలు మొదలయ్యాయి. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఆర్టిఫిషియల్ లంగ్(ఎక్మో మెషీన్) ద్వారా అతనికి చికిత్స అందించారు.
ఈ సమయంలోనే గుండెపోటుకు గురయ్యాడు. దీంతో ట్రాకియోస్టోమి, బ్రాంకోస్కోపి నిర్వహించారు. మొత్తంగా అరుణ్‌కు వైద్యులు అందించిన చికిత్స చివరకు విజయవంతమైంది. ఆరు నెలల తర్వాత అతను పూర్తిగా కోలుకున్నాడు. అరుణ్ ఆరోగ్యంగా కోలుకోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.