న్యూఢిల్లీ, మే 14: ఉపాధి గణాంకాల సేకరణ, విడుదలలో భారీ మార్పులను కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ(ఎంఓఎఫ్పీఐ) తీసుకువచ్చింది.
మొట్టమొదటిసారి త్రైమాసిక ఉపాధి గణాంకాల సేకరణను గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిచండంతోసహా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్ఈఎస్)లో అనేక కీలక మార్పులు చేసినట్లు మంత్రిత్వశాఖ బుధవారం ప్రకటించింది. 2025 సంవత్సరం ఏప్రిల్-జూన్‌కు చెందిన త్రైమాసిక ఉపాధి వివరాలను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయనున్నట్లు తెలిపింది.