న్యూఢిల్లీ: దాదాపు మూడు దశాబ్దాలుగా సాగుతున్న అవిభక్త శివసేన ఆధిపత్యానికి తెరదించుతూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా శుక్రవారం అవతరించింది. అంతేగాక పుణెలో శరద్ పవార్, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గాల కూటమిని ఓడించి విజేతగా నిలిచింది.
ముంబైతోసహా 29 మున్సిపల్ కార్పొరేషన్లకు 15న ఎన్నికలు జరగాయి. వీటిలో 25 మున్సిపల్ కార్పొరేషన్లలో మహాయుతి అధికారంలోకి వస్తుందని సీఎం ఫడ్నవీస్ చెప్పారు.