e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home జాతీయం మహారాష్ట్రలో కొత్తగా 51,751 కరోనా కేసులు

మహారాష్ట్రలో కొత్తగా 51,751 కరోనా కేసులు

మహారాష్ట్రలో కొత్తగా 51,751 కరోనా కేసులు

ముంబై: మహా­రా­ష్ట్రలో కరోనా విజృంభణ రోజు రోజుకు ఆందోళన కలిగిస్తున్నది. గత కొన్ని రోజులుగా 50 వేలకుపైగా కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 34.5 లక్షలు, యాక్టివ్ ‌కేసుల సంఖ్య 5.6 లక్షలు దాటింది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 51,751 కరోనా కేసులు, 258 మర­ణాలు నమో­ద­య్యాయి. దీంతో మహా­రా­ష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,58,996కు, మర­ణాల సంఖ్య 58,245కు చేరింది. అలాగే ముంబైలో సోమవారం 6,905 కరోనా కేసులు, 43 మరణాలు నమోదయ్యాయి.

మరోవైపు మహారాష్ట్రలో గత 24 గంటల్లో 52,312 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 28,34,473కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,64,746 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతున్నది.

Advertisement
మహారాష్ట్రలో కొత్తగా 51,751 కరోనా కేసులు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement