ఈడీ కస్టడీలోని మంత్రి నవాబ్ మాలిక్‌కు అస్వస్థత … ఆసుపత్రిలో చేరిక
ముంబై: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని జేజే ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఎన్సీపీ సీనియర్‌నేత అయిన 62 ఏండ్ల నవాబ్ మాలిక్ ఇంటికి బుధవారం ఉదయం ఈడీ అధికారులు వెళ్లారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించిన కేసుపై పలు గంటలపాటు ఆయనను ప్రశ్నించారు. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
అరెస్ట్ తర్వాత మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ అధికారులు జేజే ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిబంధనల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఈడీ ప్రత్యేక కోర్టులో ఆయనను ప్రవేశపెట్టారు. 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోర్డును ఈడీ కోరింది. అయితే వారం రోజులపాటు అంటే మార్చి 3 వరకు ఈడీ రిమాండ్‌కు కోర్టు అంగీకరించింది. దీంతో ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు.
కాగా, గత బుధవారం నుంచి ఈడీ కస్టడీలో ఉన్న మంత్రి నవాబ్ మాలిక్ శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈడీ అధికారులు ఆయనను జేజే ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నవాబ్ మాలిక్ సోదరుడికి కూడా ఈసీ సమన్లు జారీ చేసింది. అలాగే శివసేన కార్పొరేటర్ ఇళ్లలో అధికారులు సోదాలు జరిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

