మహారాష్ట్రలో కరోనా కల్లోలం: కరోనా పాస్ కోసం ఇలా అప్లై చేయండి..
కరోనా పాస్ | మహారాష్ట్రను కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దేశంలో నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో దాదాపు సగం ఇక్కడే వస్తున్నాయి.

మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ( coronavirus secondwave ) విజృంభిస్తోంది. దేశంలో నమోదయ్యే పాజిటివ్ కేసుల్లో దాదాపు సగం ఇక్కడే వస్తున్నాయి. రోజురోజుకీ కేసులు పెరిగిపోతుండటంతో కరోనా కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ( Lockdown ) విధించింది. పెళ్లిళ్లు, ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. కఠిన ఆంక్షలు అమలు అవుతున్న ఈ సమయంలో ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వం నుంచి కరోనా పాస్ ( corona e-pass ) తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతినిస్తుంది.
మరి కరోనా పాస్ ( covid-19 e-pass ) ఎలా పొందాలంటే..
- ముందుగా https://covid19.mhpolice.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్ ఓపెన్ అయ్యాక apply for pass here అనే ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది. ఆ పేజిలో మన వివరాలు అన్నింటిని నింపాల్సి ఉంటుంది.
- ఏ జిల్లా నుంచి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏ వాహనంలో వెళ్తున్నారు? వెహికిల్ నంబర్, మొబైల్ నంబర్, డెస్టినేషన్ అడ్రస్ వంటి వివరాలను అందులో నింపాల్సి ఉంటుంది.
- అత్యవసరం అయిన వారికే ఈ పాస్ ఇస్తారు. మన ఎమర్జెన్సీ ఏంటి అనేది కూడా ఆ ఫాంలో మెన్షన్ చేయాల్సి ఉంటుంది.
- కావాల్సిన డాక్యుమెంట్లు అన్నింటినీ ఒకే ఫైల్లో సేవ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లతో పాటు ఫొటో, ఫిట్నెస్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.
- ఆ తర్వాత సబ్మిట్ కొట్టగానే ఒక టోకెన్ ఐడీ వస్తుంది. ఈ టోకెన్ ఐడీని తర్వాత అవసరాల కోసం సేవ్ చేసుకోవాలి.
- అప్లికేషన్‌ను సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులు పరిశీలించిన తర్వాత ఈ పాస్‌ను ఇస్తారు.
- టోకెన్ ఐడీని ఉపయోగించి ఈ పాస్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఈ పాస్‌పై మన వివరాలు, వెహికిల్ నంబర్, పాస్ వ్యాలిడిటీ, క్యూఆర్ కోడ్ ఉంటాయి.
- ప్రయాణ సమయంలో ఈ పాస్ ప్రింటవుట్ దగ్గర ఉంచుకోవడం తప్పనిసరి.
- ఆన్లైన్లో పాస్ అప్లై చేసుకునే సదుపాయం లేని వారు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కూడా ఈ పాస్ పొందవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కొవిడ్ సెకండ్ వేవ్ భిన్నం.. వచ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?
vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
దేశంలో అందుబాటులోకి మరో టీకా.. జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి
కొవిడ్ రోగి బర్త్ డే వేడుకలు.. వీడియో వైరల్
రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ : వ్యాపారి ఔదార్యం
మే మూడో వారంలో కరోనా మరింత ఉద్ధృతం: ఎస్బీఐ రిపోర్ట్
లాభం తీసుకోకుండానే వ్యాక్సిన్లు ఇస్తాం.. ఇండియాకు ఫైజర్ ఆఫర్
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

