ముంబై: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బెదిరించిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్‌కు శనివారం గుర్తు తెలియని ఓ నంబరు నుంచి యోగి 10 రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయకపోతే, బాబా సిద్ధిఖీ మాదిరిగానే హత్యకు గురవుతారని బెదిరింపు సందేశం వచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఉల్హాస్ నగర్‌కు చెందిన ఫాతిమా ఖాన్ (24) ఈ బెదిరింపు సందేశాన్ని పంపినట్లు గుర్తించారు.