స్టాక్ మార్కెట్ పదజాలంతో వినూత్నంగా వెడ్డింగ్ కార్డ్.. సోషల్ మీడియాలో వైరల్
వరుడు డాక్టర్ సందేశ్‌ను మెడిసిన్ లిమిటెడ్‌గా, వధువు డాక్టర్ దివ్యను అనస్థీషియా లిమిటెడ్ అని రెండు కంపెనీలుగా పేర్కొన్నారు. ఈ జంట పెళ్లిని రెండు సంస్థల విలీనంగా అభివర్ణించారు.
ముంబై: ఇటీవల వివాహాలు చేసుకుంటున్న జంటలు ఏదో ఒక కొత్తదనం ఉండాలని భావిస్తున్నారు. ఈ నేపపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఒక డాక్టర్ జంట వెడ్డింగ్ కార్డ్‌ను వినూత్నంగా రూపొందించారు. పూర్తిగా స్టాక్ మార్కెట్ పదజాలంతో ఉన్న ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నాందేడ్‌కు చెందిన డాక్టర్ సందేశ్, డాక్టర్ దివ్యల వివాహం, రిసెప్షన్ ఈ నెల 6, 7 తేదీల్లో జరుగనున్నది.
అయితే స్టాక్ మార్కెట్‌ను ఎంతో ఇష్టపడే వరుడి తల్లిదండ్రులు వెడ్డింగ్ కార్డును ఆ పదజాలంతో వినూత్నంగా రూపొందించారు. వరుడు డాక్టర్ సందేశ్‌ను మెడిసిన్ లిమిటెడ్‌గా, వధువు డాక్టర్ దివ్యను అనస్థీషియా లిమిటెడ్ అని రెండు కంపెనీలుగా పేర్కొన్నారు. ఈ జంట పెళ్లిని రెండు సంస్థల విలీనంగా అభివర్ణించారు. హిందూ సంప్రదాయ ‘రెగ్యులేటరీ నిబంధనల’కు అనుగుణంగా ఈ జంట కంపెనీల విలీనం (పెళ్లి) జరుగుతుందన్నారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో)ను విలువైన సందర్భ ఆహ్వానం’గా పేర్కొన్నారు. బంధు, మిత్రులను ‘రిటైల్ పెట్టుబడిదారులు’గా వ్యవహరించారు.
అలాగే వివాహ వేడుకను ‘లిస్టింగ్ వేడుక’గా సూచించారు. వివాహ తేదీలను ‘బిడ్డింగ్ డేట్స్’గా పేర్కొన్నారు. అంతేగాక ఈ పెళ్లికి సంబంధించిన వివిధ ఆచారాలకు కూడా స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పేర్లు పెట్టారు. సంగీత్‌ను ‘రింగింగ్ బెల్’ అని, రిసెప్షన్‌ను ‘మధ్యంతర డివిడెండ్ చెల్లింపు’ అని, ముహుర్తాన్ని ‘లిస్టింగ్ వేడుక’ అని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి సౌకర్యాలను ‘బోనస్’ అని వ్యవహరించారు.
పెళ్లి వేదిక అయిన గుల్బర్గాలోని హున్నాబాద్ రోడ్లో ఉన్న సకాసర్ గార్డెన్స్‌ను ‘స్టాక్ ఎక్స్ఛేంజ్’గా, వరుడి తల్లిదండ్రులను ‘ప్రమోటర్లు’గా పేర్కొన్నారు. ‘స్టాక్ మార్కెట్ ఇండియా’ అన్న ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వినూత్న వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కొందరు నెటిజన్లు కూడా స్టాక్ మార్కెట్ పదజాలంతో కామెంట్లు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

