Lalit Salve | ముంబై : మహారాష్ట్రకు చెందిన లలిత్ సాల్వే (36) ఓ బిడ్డకు తండ్రి అయ్యారు. ఇది సాధారణమే కదా అనుకోకండి! జన్మతః లలిత్ స్త్రీ. కుటుంబంలో బాలిక (లలిత)గానే పెరిగి పెద్దయ్యారు. బీడ్‌కు చెందిన లలిత్ 2010లో మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. 2013 నుంచి ఆమెలో ట్రాన్స్-సెక్సువల్ జెండర్ లక్షణాలు కనిపించడం మొదలైంది.
నాలుగేళ్ల తర్వాత 2017లో చేయించిన పరీక్షల్లో ఆమె శరీరంలో ‘వై’ క్రోమోజోమ్ ఉన్నట్లు వెల్లడైంది. 2018-2020 మధ్య కాలంలో మూడుసార్లు సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ చేయించుకున్నారు. 2020లో సీమ అనే యువతిని పెండ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఈ నెల 15న ఓ మగ బిడ్డ జన్మించాడు. తాను స్త్రీ నుంచి పురుషునిగా మారే కాలంలో అనేక మంది తనకు మద్దతుగా నిలిచారని లలిత్ చెప్పారు.