హైదరాబాద్ : ప్రముఖ మేకప్ స్టూడియో మహదీయ తమ నూతన మేకప్ స్టూడియోను హైదరాబాద్ లో ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, నటి నమ్రత శిరోద్కర్, అలీ రెజా ఖెరాద్మంద్,రోహిత్ ఖండేల్వాల్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహదీయ దర్వేష్ మాట్లాడుతూ ‘‘ నా కల నిజమైన రోజు ఇది. నా కల సాకారం కావడంలో మా నాన్న నాకు ఎంతగానో సహాయపడ్డారు. వినియోగదారుల సంతృప్తే మహదీయాస్ మేకప్ స్టూడియో ప్రధాన లక్ష్యం” అన్నారు.
ఈ స్టూడియో అన్ని సందర్భాలకూ తగిన రీతిలో మేకప్స్, హెయిర్డూస్, అన్ని రకాల డ్రేపింగ్స్ మరియు జ్యువెలరీ శైలి మొదలైనవి ఉన్నాయి. వివాహం, పార్టీలు, పండుగలు మొదలైన సందర్భాల కోసం అత్యుత్తమ ఔట్ఫిట్స్, ఆభరణాల అవసరాలను సైతం ఇది తీరుస్తుంది.