మధురై: నటి, టీవీ ప్రెజెంటర్ కస్తూరి శంకర్‌కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం గురువారం తిరస్కరించింది. తమిళనాడులోని తెలుగు మాట్లాడేవారిపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు దాఖలైన కేసులో అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించాలని ఆమె కోరారు. జస్టిస్ ఆనంద్ వేంకటేశ్ మాట్లాడుతూ.. కస్తూరి ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమర్థనీయం కాదన్నారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం నుంచి తెలుగువారు తమిళనాడులో ఉంటున్నారని, ఈ దేశంలో వారు కూడా భాగమేనని చెప్పారు.