బోఫాల్ : భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ప్రియుడితో వివాహేతర సంబంధం బయట పడటంతో ఆమె సుపారీ గ్యాంగ్‌తో భర్తను చంపించింది. అయితే దొంగల దాడిలో తన భర్త చనిపోయాడని పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించి చివరికి కాల్ డాటాతో దొరికిపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. ధార్ జిల్లాకు చెందిన దేవకృష్ణ రోహిత్(28), ప్రియాంక(25) భార్యాభర్తలు.
ఈ నెల 7న దుండగులు ఇంట్లో చొరబడి తనను కట్టేసి తన భర్తను హత్య చేసి ఇంట్లోని నగలు, నగదు దోచుకెళ్లారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దొంగతనం జరగలేదని పోలీసుల దర్యాప్తులో తేలడంతో పోలీసులు అనుమానంతో ప్రియాంకను గట్టిగా ప్రశ్నించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమె కాల్ డాటాను పరిశీలించి ఆమెకు కమలేశ్ అనే వ్యక్తితో 2020 నుంచి వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుసుకున్నారు. రోహిత్ నల్లగా ఉన్నాడని.. అతడి కన్నా మంచి రంగు ఉన్నవాడు తనకు కావాలని తరచూ ప్రియాంక అతడితో గొడవ పడేదని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.